ప్రభాస్ హీరోయిన్ పెళ్లి ఫిక్స్

Wednesday,January 16,2019 - 12:46 by Z_CLU

మిర్చి, భాయ్, లీడర్, మిరపకాయ్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రిచా గంగోపాధ్యాయ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించింది. అమెరికాలోని బిజినెస్ స్కూల్ లో తనతో పాటు కలిసి చదువుకున్న జో అనే వ్యక్తిని ఆమె పెళ్లాడనుంది. రెండేళ్లుగా వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారు

లీడర్ సినిమాతో టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అయింది రిచా గంగోపాధ్యాయ. మిరపకాయ్ సినిమా ఆమెకు క్రేజ్ తీసుకొచ్చింది. తమిళ్ లో చేసిన మయక్కమ్ ఎన్నా అనే సినిమా ఆమెకు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. నాగవల్లి, సారొచ్చారు. మిర్చి సినిమాలు చేసిన రిచా.. భాయ్ తర్వాత తిరిగి అమెరికా వెళ్లిపోయింది. చదువుపై ఫోకస్ పెట్టింది.

అలా చదువుకుంటున్న టైమ్ లోనే జో పరిచయమవ్వడం, ప్రేమలో పడడం జరిగిపోయాయి. రెండేళ్లుగా ప్రేమిస్తున్న “జో”ను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది రిచా. సినిమాల్లోకి ఇక రానని ఈ సందర్భంగా మరోసారి క్లారిటీ ఇచ్చింది.