పవర్ స్టార్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వర్మ

Thursday,July 09,2020 - 06:17 by Z_CLU

పవర్ స్టార్ అనే సినిమా తీయబోతున్నట్టు ప్రకటించిన వర్మ.. చెప్పిన కొన్ని రోజులకే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఈరోజు పవర్ స్టార్ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ మూవీకి ఎన్నికల ఫలితాల తర్వాత అనే క్యాప్షన్ పెట్టాడు వర్మ.

అయితే ఇక్కడితో ఆగలేదు ఈ దర్శకుడు. ఫస్ట్ లుక్ తో పాటు సినిమా స్టిల్స్ వరుసగా రిలీజ్చేస్తున్నాడు. ఈ స్టిల్స్ చూసిన తర్వాత ఎవరైనా గుర్తొస్తే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే అంటున్నాడు.