కరోనా ప్రోమో రిలీజ్ చేసిన వర్మ

Wednesday,April 01,2020 - 02:11 by Z_CLU

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ పాట రాశాడు. కేవలం రాయడం కాదు, ఆ పాటను తనే స్వయంగా పాడాడు కూడా. కరోనాను ఓ పురుగుతో పోలుస్తూ.. కనిపించని పురుగు అనే లిరిక్స్ తో ఈ పాట కంపోజ్ చేశాడు.

దీనికి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశాడు వర్మ. ఫుల్ సాంగ్ ను సాయంత్రం విడుదల చేస్తానని ప్రకటించాడు. కరోనాను నలిపేద్దామంటే అంత సైజు లేదు.. పచ్చడి చేద్దామంటే కండ లేదు.. బాంబు పెడదామంటే ఉనికి లేదంటూ వర్మ రాసిన ఈ లైన్స్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

సందర్భం ఏదైనా దాన్ని తన వైపు తిప్పుకోవడంలో ఆర్జీవీ దిట్ట. ఇప్పుడు కరోనాను కూడా ఇలా వాడుకుంటున్నాడు. రేపోమాపో దీనిపై అతడు సినిమా ఎనౌన్స్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.