Republic - పని పూర్తిచేసిన సాయితేజ్
Tuesday,February 23,2021 - 01:39 by Z_CLU
సాయితేజ్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రిపబ్లిక్. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. యూనిట్ అందరితో కలిసి సాయితేజ్ దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా సాయితేజ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘రిపబ్లిక్’. ‘ప్రస్థానం’ వంటి డిఫరెంట్ పొలిటికల్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు దేవ్ కట్టా దర్శకత్వంలో ‘రిపబ్లిక్’ సినిమా వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.
రీసెంట్‌గా విడుదల చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్, అందులోని కాన్సెప్ట్‌కి ప్రేక్షకుల నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై ఈ చిత్రాన్నినిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు అన్ కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు.
వరల్డ్‌వైడ్‌గా జూన్ 4న విడుదల కానుంది రిపబ్లిక్.