Republic Movie - ట్రయిలర్ రివ్యూ

Wednesday,September 22,2021 - 01:22 by Z_CLU

సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రిపబ్లిక్’ సినిమా అక్టోబర్ 1న రిలీజ్ కి రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను మెగా స్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. 1 : 55 నిమిషాలతో క్రిస్ప్ గా ట్రైలర్ ని కట్ చేశారు.

“సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు, పట్టపగలే బాహాటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్లకి కొమ్ము కాస్తున్నాయ్” అంటూ తేజ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటూ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తుంది. ఇక జగపతి బాబు, రమ్యకృష్ణ పాత్రలను కూడా ట్రైలర్ లో హైలైట్ చేశారు. ముఖ్యంగా రమ్యకృష్ణ పొలిటికల్ లీడర్ గా కనిపించనుందని ఆమె పాత్రలో నెగిటివ్ షేడ్ ఉంటుందని క్లియర్ కట్ చూపించారు.

అలాగే సినిమాలో కలెక్టర్ పాత్రలో నటించిన తేజ్ కలెక్టర్ వృత్తి గురించి చెప్తూ వచ్చే డైలాగ్ కూడా ఆకట్టుకుంది. సమాజంలో జరిగే అన్యాయంపై ఒక కలెక్టర్ ఎలా పోరాడాడు ? ప్రజల పక్షాన ఉంటూ వారికి ఎలా అండగా నిలిచాడు? అనేది సినిమా ఇతివృత్తమని ట్రైలర్ తో చెప్పేశాడు దర్శకుడు దేవకట్టా. సినిమాలో ఐశ్వర్య రాజేష్ పాత్ర కూడా రెగ్యులర్ హీరోయిన్ లా కాకుండా కథలో ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది.

republic ramyakrishna

ట్రైలర్ లో సాయి ధరమ్ తేజ్ పవర్ ఫుల్ డైలాగ్స్ , కెమెరామెన్ సుకుమార్ విజువల్స్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచాయి. ఫైనల్ గా టైటిల్ గురించి కూడా ట్రైలర్ లో జస్టిఫికేషన్ ఇచ్చారు. ఫైనల్ గా చాన్నాళ్ళకి ప్రేక్షకులు ఓ మాంచి ఆసక్తికరమైన పొలిటికల్ డ్రామా సినిమా చూడబోతున్నారని మేకర్స్ ట్రైలర్ కట్ తో సినిమాపై అంచనలు పెంచేసి బజ్ క్రియేట్ చేసారు. మరి అక్టోబర్ 1 న థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమా ఆడియన్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics