#Republic - రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Sunday,September 19,2021 - 06:35 by Z_CLU

సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా ‘రిపబ్లిక్’ . షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. సినిమా అక్టోబర్ 1న రిలీజ్ అంటూ ఎప్పుడో ఎనౌన్స్ చేశారు మేకర్స్. కానీ తేజ్ కి ఇటివలే యాక్సిడెంట్ జరగడం ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతుండటంతో ‘రిపబ్లిక్’ అనుకున్న డేట్ కి రిలీజ్ అవ్వడం కష్టమే అనే టాక్ వినబడింది.

రిలీజ్ లోపు తేజ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినా పూర్తిగా కోలుకోవడానికి ఇంకా టైం పడుతుంది. అందుకే సినిమా రిలీజ్ ని మేకర్స్ పోస్ట్ పోన్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే లేటెస్ట్ అప్డేట్ తో సినిమా రిలీజ్ పై పూర్తి క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. సినిమా సెన్సార్ పూర్తి చేసుకుందని తెలియజేస్తూ ప్రకటించినట్లే అక్టోబర్ 1 నే గ్రాంగ్ గా రిలీజ్ అవ్వనుందని పోస్టర్ తో చెప్పారు.

republic movie sai dharam tej

దీంతో సినిమా రిలీజ్ పై ఉన్న డౌట్స్ అన్నీ పటా పంచలయ్యాయి. సాయి ధరం తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫర్ ది ఫస్ట్ టైం ఈ సినిమాలో తేజ్ కలెక్టర్ గా కనిపించబోతున్నాడు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను దేవకట్టా ఎలా తెరకెక్కించాడా అంటూ మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే #ThankyouCollector అంటూ కలెక్టర్స్ గురించి స్పెషల్ వీడియోలు రిలీజ్ చేస్తూ వారి గొప్పతనం చెప్తూ సినిమాను కొత్త తరహాలో ప్రమోట్ చేస్తున్నారు యూనిట్. ఇక ఆ మధ్య విడుదలైన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. సో తేజ్ ప్రమోషన్స్ ని ఎటెండ్ అవ్వలేకపోయినప్పటికీ ప్రమోషన్స్ లో విషయంలో పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నారు మేకర్స్. మరి ఫస్ట్ టైం పొలిటికల్ కథతో తేజ్ చేసిన రిపబ్లిక్ కి పబ్లిక్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics