సెట్స్ పై రిపీటెడ్ కాంబోలు

Friday,August 09,2019 - 11:02 by Z_CLU

ఓ సినిమా సక్సెస్ అయితే న్యాచురల్ గానే ఆ కాంబినేషన్ చుట్టూ ఆడియెన్స్ లో క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఆ కాంబినేషన్ లో ఇంకో సినిమా సెట్స్ పైకి రావాలి కానీ, గతంలో కన్నా ఈ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ అవుతాయి. ఆలా సినిమా సెట్స్ పై ఉండగానే ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి ఈ రిపీటెడ్ కాంబోలు…

RRR – రాజమౌళి… NTR, రామ్ చరణ్ ఇద్దరితోనూ గతంలో సినిమా చేశాడు. అటు NTR ఫ్యాన్స్, ఇటు చెర్రీ ఫ్యాన్స్ ఈ టాప్ స్టార్స్ నుండి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారన్నది ఖచ్చితంగా తెలిసిన దర్శకుడు. అందునా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా. దానికి తోడు కనీసం ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని NTR, చెర్రీ ల మల్టీస్టారర్. అన్నీ కలిసి ‘RRR’ పై భారీ అంచనాలున్నాయి.

AA19 : అల్లు అర్జున్, త్రివిక్రమ్… ఇప్పటికే ఇద్దరూ కలిసి 2 సినిమాలు చేశారు. ‘జులాయి’ గురించి మాట్లాడినా, ‘S/o సత్యమూర్తి’ గురించి మాట్లాడినా రెండూ దేనికదే స్పెషల్ అనిపించుకున్న సినిమాలు. అందుకే సెట్స్ పై ఉన్న ఈ సినిమా గురించి ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ. బన్ని సినిమా అంటే న్యాచురల్ గానే ఫ్యాన్స్ లో అంచనాలుంటాయి. కానీ ఈ సారి కూడా త్రివిక్రమ్ జోడయ్యేసరికి..మరింత స్పెషల్ అనిపించుకుంటుందీ సినిమా.

మేజర్ : అడివి శేష్, దర్శకుడు శశి కిరణ్ తిక్క డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ‘గూఢచారి’. ఇప్పుడిదే కాంబినేషన్ లో ‘మేజర్’ తెరకెక్కుతుంది. దానికి తోడు ఈ ఇంటెలిజెంట్ కాంబో, ఈసారి మిలిటరీ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవడంతో సినిమా నుండి మరింత కొత్తదనం ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఆడియెన్స్.

V – ఇప్పటికే 2 సినిమాలు కలిసి చేశారు నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి. అందుకే ‘V’ పై భారీ అంచనాలు. దానికి తోడు ఈ ఇద్దరు కలిసి సినిమా చేశారంటే డీటేల్స్ అంత ఈజీగా రివీల్ చేయరు. నిజానికి ఈ సినిమా సుధీర్ బాబుదే. కానీ టైటిల్ దగ్గరి నుండి ప్రతీది నాని క్యారెక్టర్ నే హైలెట్ చేస్తున్నాయి. అందునా నాని 25 వ సినిమా కాబట్టి బయటపడట్లేదు కానీ, మోహనకృష్ణ ఇంద్రగంటి ఏదో స్పెషల్ గానే ప్లాన్ చేస్తున్నాడు అని ఫ్యాన్స్ ఫీలింగ్.