రారండోయ్ సినిమాకు రిపీట్ ఆడియన్స్

Wednesday,May 31,2017 - 04:33 by Z_CLU

విడుదలైన మొదటి రోజు నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతున్న సినిమా రారండోయ్ వేడుక చూద్దాం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. పాజిటివ్ మౌత్ టాక్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వడంతో.. చూసిన వాళ్లే మళ్లీ మళ్లీ సినిమా చూస్తున్నారు. అలా స్టడీగా వసూళ్లు రాబడుతూ థియటర్లలో దూసుకుపోతోంది రారండోయ్ వేడుక చూద్దాం సినిమా.

పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి తీసిన సినిమా ఇది. కథకు ఓకే చెప్పినప్పట్నుంచి, సెట్స్ పైకి వచ్చినంతవరకు అంతా ఇదే కాన్సెప్ట్ తో పనిచేశారు. థియేటర్లలోకి వచ్చిన తర్వాత మేకర్స్ అనుకున్నది హండ్రెస్ పర్సెంట్ వర్కవుట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ రాకతో యూనిట్ నమ్మకం నిజమైంది. అయితే కుటుంబ ప్రేక్షకులతో పాటు యూత్ కు కూడా సినిమా కనెక్ట్ అవ్వడం హైలెట్.

నాగచైతన్య-రకుల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ టోటల్ సినిమాకే హైలెట్ గా నిలవగా.. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ మూవీకి మెయిన్ ఎట్రాక్షన్ గా మారాయి. వీటికి తోడు దేవిశ్రీ సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడంతో.. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా సక్సెస్ ఫుల్ వెంచర్ అనిపించుకుంది.