తన ఇద్దరు పిల్లలతో రేణూ దేశాయ్ ఎక్కడికి వెళ్లిందో తెలుసా?

Tuesday,July 19,2016 - 06:16 by Z_CLU

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు తనకి సంబంధించిన అన్ని విషయాలను ఫాన్స్‌తో షేర్ చేసుకునే రేణూ తాజాగా మాల్దీవుల టూర్‌కి సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో రేణూ దేశాయ్ తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యాతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. అకీరా గళ్ళ లుంగీ కట్టుకొని సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీలోని పవన్ స్టైల్‌తో కనిపించాడు. అయితే ఈ ఫ్యామిలీ పవన్‌తో కలిసి వెళ్ళారనే టాక్ నడుస్తోంది. అందుకు కారణం పవన్ ఇటీవల వెకేషన్‌కి ఫారెన్ ట్రిప్ వేయగా, ఎయిర్ పోర్ట్‌లో కొందరు పవన్‌ని తమ కెమెరాలో బంధించారు. ఆ టైంలో పవన్ తన పిల్లలతో కలిసి మాల్దీవులకే వెళ్ళి ఉంటారని ప్రచారం జరుగుతుంది.