మరో సినిమా స్టార్ట్ చేసిన సాయి తేజ్

Wednesday,November 20,2019 - 03:26 by Z_CLU

ప్రతి రోజూ పండగే సినిమాను ఇలా కంప్లీట్ చేసి, అలా కొత్త సినిమా స్టార్ట్ చేశాడు సాయి తేజ్. ఈ మెగా హీరో కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్నట్నుంచి మొదలైంది. సినిమా పేరు సోలో బ్రతుకే సో బెటర్.

శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. సమ్మర్ ఎట్రాక్షన్ గా. మే డే కానుకగా మే 1న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని యూనిట్ ప్రకటించింది.

సాయితేజ్ సినిమాలకు వరుసగా సంగీతం అందిస్తున్న తమన్, ఈ కొత్త సినిమాకు కూడా మ్యూజిక్ అందించబోతున్నాడు. ఇప్పటివరకు పోషించని డిఫరెంట్ క్యారెక్టర్ ను సాయితేజ్ ఈ సినిమాలో పోషిస్తున్నాడు.