Regina new movie titled as Breaking News
రెజీనా, సుబ్బరాజు, జె.డి.చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘బ్రేకింగ్ న్యూస్’. సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘సోషల్ సెటైరికల్‌గా ప్రస్తుత కాలమాన పరిస్థితులపై వాస్తవిక కోణంలో.. ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైరెక్టర్ సుబ్బు వేదుల ‘బ్రేకింగ్ న్యూస్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సోమవారం నుంచి ప్రారంభమైన షూటింగ్ డిసెంబర్ మూడో వారం వరకు కొనసాగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణను చేస్తున్నాం. వైవిధ్యమైన కథనంతో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు.

నటీనటులు:
రెజీనా కసాండ్ర, సుబ్బరాజు, జె.డి.చక్రవర్తి, ఝాన్సీ, సురేశ్ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: సుబ్బు వేదుల
నిర్మాణం: రా ఎంటర్‌టైన్మెంట్స్, మ్యాంగో మాస్ మీడియా
కథ, మాటలు: బి.వి.ఎస్.రవి
స్క్రీన్ ప్లే : కళ్యాణ్ వర్మ, వంశీ బలపనూరి, సుబ్బు వేదుల, సందీప్ గాదె
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కౌముది నేమని
సినిమాటోగ్రఫీ : ఈశ్వర్ ఎలుమహంతి
ఎడిటర్ : వర ప్రసాద్
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
ఆర్ట్: షర్మిల చౌదరి
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics