హీరోయిన్ రెజినా ఇంటర్వ్యూ

Monday,August 12,2019 - 05:29 by Z_CLU

డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ మెప్పిస్తూ కెరీర్ కొనసాగిస్తున్న రెజినా తన లేటెస్ట్ సినిమా ‘ఎవరు’ గురించి మీడియాతో మాట్లాడింది. ఆ విశేషాలు ఈ బ్యూటీ మాటల్లోనే..

క్యారెక్టర్ నచ్చింది

ఈ సినిమా చేయమని నిర్మాత పివిపి గారు కాల్ చేసి అడిగారు.  రాంజీ అనే డెబ్యూ డైరెక్ట్ హ్యాండిల్ చేస్తాడని చెప్పారు. ఆ తర్వాత రాంజీ గారు శేష్ చెన్నైకి వచ్చి నెరేషన్ ఇచ్చారు. కథ విన్నాను నచ్చడంతో వెంటనే ఒకే చెప్పి చేశాను.

మీరే నా ఫస్ట్ ఛాయిస్

షూటింగ్ మొదటి రోజు మేడం మీరే నా ఫస్ట్ ఛాయిస్ అని డైరెక్టర్ రాంజీ చెప్పాడు. ఆ విషయం నాకు నెరేషన్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పలేదు. ఆ మాట చాలా సంతోషపడ్డాను. ఈ క్యారెక్టర్ నాకు దొరకడం హ్యాపీ గా ఉంది.

నాకు ఫుల్ మీల్స్

సినిమాలో సమీర అనే క్యారెక్టర్ చేసాను. ఒక కంపెనీ సీ.ఈ.ఓ కి భార్యగా కనిపిస్తాను. ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్.ఎక్కువగా మాట్లాడదు,  ఫేస్ లో ఎక్కువ ఎక్స్ ప్రేషన్స్ ఉండవు. చాలా డిఫెరెంట్ గా ఉంటుంది. ఇప్పటి వరకూ ఇలాంటి క్యారెక్టర్ ఫుల్ ఫ్లెడ్జ్ గా చేయలేదు. ఆ రకంగా నాకిది ఫుల్ మీల్స్ లాంటి క్యారెక్టర్. చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ చేసాను. ఇలాంటి క్యారెక్టర్స్ అప్పుడప్పుడూ వస్తుంటాయి.

నా ఫుడ్ తినేవాడు

శేష్ నైస్ పర్సన్. సెట్స్ లో చాలా సరదాగా ఉండేవాళ్ళం. నా ఫుడ్ తినేవాడు. నేను తినే ఫుడ్ అంటే చాలా ఇష్టపడేవాడు. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తూ సినిమా చేసాం.

80 % ఉంటాను

సినిమాలో నేను 80 % ఉంటాను. శేష్ రాంజీ నాకు కథ చెప్పినప్పుడు కూడా దే చెప్పారు. ఒక సినిమాలో ఇంత లెంగ్త్ , ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

మీరే చెప్తారు

సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక బద్లా సినిమాకు ఎవరుకి కొంచెం సిమిలారిటీ ఉందని అంటున్నారు. సినిమా చూసాక రెండిటికి ఎలా తేడా ఉండదని గమనిస్తారు. సో అప్పుడు మీరే చెప్తారు.

అస్సలు  ఆలోచించను

ఏదైనా సినిమా చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ నా కెరీర్ కి ఎలా హెల్ప్ అవుతుంది.. ఎంత పెరుస్తుంది అని అస్సలు ఆలోచించను. క్యారెక్టర్ కి నేను బెస్ట్ ఇవ్వగలనా అనేది మాత్రమే ఆలోచిస్తాను. ఎవరు చేసేటప్పుడు కూడా అదే ఆలోచించను.

చాలా నేర్చుకున్నాను

ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్ళయింది. నా మొదటి సినిమా ఎస్.ఎం.ఎస్ 2011 లో విడుదలైంది. అప్పుడు నాకేం తెలియదు. సినిమా చేసేటప్పుడు రూల్స్ కానీ కొన్ని సార్లు ప్రోటోకాల్ పాటించాలని తెలియదు. ఇప్పుడు చాలా నేర్చుకున్నాను. ఈ ఏడేళ్ళల్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.

నా తప్పులే

ఏదైనా సినిమా ఫెయిలయినప్పుడు అందులో నేను చేసిన తప్పులు కూడా ఆలోచిస్తాను. చేసిన ప్రతీ సినిమాకు నన్ను నేను అనాల్సీస్ చేసుకుంటాను. కొన్ని సార్లు మనం రైట్ అనుకుంటాం కానీ అవి రాంగ్ అవుతుంటాయి.

డెబ్యూ కదా అవసరమా అన్నారు

నిజానికి కొన్ని సార్లు రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తుంది. ‘ఏక్ లడికి కో దేఖాతో ఐసా లగా’ సినిమాను అలాంటి రూల్ నే బ్రేక్ చేసాను. అందులో విభిన్నగా లెస్బియన్ క్యారెక్టర్ చేసాను. క్యారెక్టర్ చిన్నదే అయినా నటిగా నాకు మంచి పేరొచ్చింది. ఆ క్యారెక్టర్ చేయడం కరెక్టేనా..? అని చాలా ఒపీనియన్స్ తీసుకున్నాను. కొందరు అలాంటి క్యారెక్టర్ తో డెబ్యూ అవసరమా అని అడిగారు. ఫైనల్ గా ఆ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చింది.