NTR అరవింద సమేత నుండి మరో ప్రోమో

Monday,October 08,2018 - 05:13 by Z_CLU

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అరవింద సమేత ఫీవర్ కనిపిస్తుంది. మరో 3 రోజుల్లో సిల్వర్ స్క్రీన్ ని హిట్ చేయనున్న అరవింద సమేత రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అయితే వీటికి తోడు ఈ సినిమా మేకర్స్ రేపు సాయంత్రం 4:50 నిమిషాలకు ‘రెడ్డి ఇక్కడ సూడు’ ప్రోమో రిలీజ్ చేయనున్నారు.

NTR మార్క్ ఎలివేట్ అయ్యేలా మాస్ బీట్స్ తో కంపోజ్ అయిన ఈ సాంగ్ విజువల్స్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. జానీ మాస్టర్ ఈ పాటకి స్టెప్స్ కంపోజ్ చేశాడు. అయితే ఈ సాంగ్ ఎంత గ్రాండియర్ గా తెరకెక్కిందనేది ఈ ప్రోమో సాంగ్ తో రివీల్ చేయనున్నారు ఫిలిమ్ మేకర్స్.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. K. రాధాకృష్ణ ప్రొడ్యూసర్. హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.