అరవింద సమేతలో 'రెడ్డి ఇక్కడ సూడు’ సాంగ్ ప్రోమో

Tuesday,October 09,2018 - 05:11 by Z_CLU

NTR అరవింద సమేత నుండి ‘రెడ్డి ఇక్కడ సూడు’ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. సినిమాలో ఉన్న 4 పాటల్లోంచి NTR మార్క్ ఉన్న సాంగ్ ఇది. 0:30 సెకన్ల నిడివి ఉన్న ఈ సాంగ్ ప్రోమో చూస్తుంటే, థియేటర్స్ లో ఈ సాంగ్ విజువల్స్ కి విజిల్స్ గ్యారంటీ అనిపిస్తుంది.

జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ లో NTR మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. దానికితోడు NTR, పూజా హెగ్డేల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సింప్లీ సూపర్బ్. మరో 2 రోజుల్లో థియేటర్స్ లోకి రానున్న అరవిందసమేత, NTR డ్యాన్స్ ని ఏ మాత్రం మిస్ అవ్వరనే క్లారిటీ ఇస్తుంది ఈ సాంగ్ ప్రోమో.

పూజా హెగ్డే తో పాటు ఈషా రెబ్బ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్. S. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ డైరెక్టర్.