Recce - ఇంట్రెస్టింగ్ ట్రైలర్

Thursday,June 09,2022 - 03:27 by Z_CLU

సినిమా అయినా, సిరీస్  అయినా కంటెంట్ ఏదైనా దాని మీద అంచనాలు పెంచేది ట్రైలరే. తాజాగా రిలీజైన ‘రెక్కీ’ ట్రైలర్ సిరీస్ పై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. ప్రతి శుక్రవారం ఓటీటీలో కొన్ని సిరీస్ లు వస్తుంటాయి. అయితే జూన్ 17న విడుదల కానున్న రెక్కీ ఎందుకు చూడాలనే ప్రశ్నకి ట్రైలర్ తో సమాధానం ఇచ్చారు మేకర్స్.

తాడిపత్రిలో ఇంకో ఆరు నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అక్కడ ఓ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.” అంటూ వాయిస్ ఓవర్ తో జాతర విజువల్స్ తో మొదలైన రెక్కీ ట్రైలర్ లో ఆ తర్వాత “తాడి పత్రిలో మూడేళ్ళ క్రితం క్రికెట్ గ్రౌండ్ లో ఓ హత్య జరిగింది” అంటూ శ్రీరామ్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన సీన్ తో ట్రైలర్ గ్రాఫ్ పెరిగింది. ట్రైలర్ చూస్తే  మర్డర్ మిస్టరీతో తెరకెక్కిన ఈ సిరీస్ ఆద్యంతం ఉత్కంత భరితంగా సాగనుందని అర్థమవుతుంది. సిరీస్ లో ఉండే పాత్రలు అలాగే  ఊహించని సంఘటనల తాలుకు సన్నివేశాలు ట్రైలర్ లో ఇంక్లూడ్ చేసి సస్పెన్స్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా ట్రైలర్ లో కొన్ని షాట్స్ , స్కోర్ , నటీ నటుల పెర్ఫార్మెన్స్ లు హైలైట్ గా నిలిచి ఎప్పుడెప్పుడు సిరీస్ చూద్దామా ? అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

ఒక హత్య చేయడానికి ముందు రెక్కీ చేసే కథతో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సిరీస్ లో శ్రీరామ్ , శివ బాలాజీ , ఎస్తర్,  ధన్య బాలకృష్ణ , రాజశ్రీ నాయర్ , శరణ్య, సమ్మెట గాంధి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. KV శ్రీరామ్ నిర్మాణంలో కృష్ణ పోలూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెక్కీ’ సిరీస్ 7ఎపిసోడ్స్ గా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

RECCE‘ Premieres On 17th June Only On Zee5