ధృవ పోస్ట్ పోన్ వెనక కారణం అదే...

Saturday,November 26,2016 - 04:13 by Z_CLU

మెస్ట్ ఎవెయిటింగ్ మూవీ ధృవ అనుకున్న తేదీ కంటే కాస్త ఎక్కువరోజులే ప్రేక్షకుల్ని ఎదురుచూసేలా చేేసింది. నిజానికి ఈ సినిమాను ఈనెలలోనే విడుదల చేస్తారని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. ఫైనల్ గా డిసెంబర్ 2 తేదీ ఫిక్స్ చేసి, ఆ డేట్ నుంచి కూడా సినిమా విడుదలను వాయిదావేశారు. తాజాగా డిసెంబర్ 9న సినిమా రిలీజ్ అవుతోంది. ఈసారి వాయిదాల్లేవ్…డేేట్ ఫిక్స్. కాకపోతే.. ఇంతకుముందు అన్నిసార్లు వాయిదా ఎందుకుపడింది అనేది ప్రశ్న. ఆ క్వశ్చన్ కు ఎట్టకేలకు ఆన్సర్ ఇచ్చాడు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.

dhruva-cover-pic

పెద్ద నోట్ల రద్దు వల్లనే తమ సినిమాను వాయిదాా వేయాల్సి వచ్చిందని అల్లు అరవింద్ స్పష్టంచేశారు. ఓవైపు జనాలంతా చిల్లర లేక ఏటీఎం ముందు క్యూలు కడుతుంటే… ధృవ సినిమాను విడుదల చేయడం మంచిది కాదని అల్లు అరవింద్ తో పాటు యూనిట్ అంతాా భావించింది. అందుకే ఇష్టంలేకపోయినా డిసెంబర్ 2 తేదీ నుంచి తప్పుకున్నట్టు అల్లు అరవింద్ కాస్త బాధగానే తన ఆవేదన వ్యక్తంచేశారు.