అసలైన నక్షత్రం ప్రకాష్ రాజ్

Thursday,August 03,2017 - 06:56 by Z_CLU

నక్షత్రం సినిమాలో సందీప్ కిషన్ హీరో. ఓ కీలకమైన పాత్రలో ఆల్ మోస్ట్ హీరోతో సమానంగా సాయిధరమ్ తేజ్ కూడా కనిపించబోతున్నాడు. ఈ రెండు విషయాలు చాలా మందికి తెలిసినవే. అయితే చాలామందికి తెలియని విషయం ఇంకోటి ఉంది. ఈ సినిమాలో మూడో హీరో కూడా ఉన్నాడు. అతడే ప్రకాష్ రాజ్.

నక్షత్రం సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ ను ఎంతో కేర్ తీసుకొని తీర్చిదిద్దాడు దర్శకుడు కృష్ణవంశీ. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తూనే, ఓ మంచి సందేశం ఇచ్చేలా, నక్షత్రంలో ప్రకాష్ రాజ్ పాత్ర ఉంటుందట.

కృష్ణవంశీ-ప్రకాష్ రాజ్ ది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. కృష్ణవంశీ తీసిన చాలా సినిమాల్లో మంచి పాత్రలు పోషించాడు ప్రకాష్ రాజ్. సముద్రం, అంతఃపురం, ఖడ్గం, చక్రం, గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో ప్రకాష్ రాజ్ పాత్రల్ని టాలీవుడ్ ప్రేక్షకులు మరిచిపోలేరు. ఇప్పుడు నక్షత్రంలో కూడా వాటికి తీసిపోని రేంజ్ లో అదిరిపోయే పాత్రను ప్రకాష్ రాజ్ కు ఇచ్చాడు కృష్ణవంశీ.