అల్లు శిరీష్ తండ్రిగా నాగ‌బాబు

Saturday,December 15,2018 - 04:06 by Z_CLU

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాల నటుడు భరత్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.

అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది.  కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చివ‌రి షెడ్యూల్ జ‌ర‌ుపుకుంటుంది. ఇదిలావుండ‌గా ఎబిసిడి చిత్రానికి మ‌రో ఎట్రాక్షన్ తోడ‌ైంది. మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు హీరో తండ్రిగా న‌టించిన గీతాగోవిందం, అర‌వింద స‌మేత చిత్రాలు మంచి విజ‌యాలు సాధించాయి.. ఇప్ప‌డు అల్లు శిరీష్ కి ఫాద‌ర్ గా నాగ‌బాబు నటించ‌టం ఈ సినిమాకు పెద్ద సెంటిమెంట్ గా మారింది. నాగబాబుతో అల్లు శిరీష్ కు ఇదే ఫస్ట్ మూవీ

నటీనటులు
అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, భరత్

సాంకేతిక వర్గం
మ్యూజిక్ డైరెక్టర్ – జుధా సాంధీ
కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
బ్యానర్స్ – మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్
నిర్మాతలు – మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని
దర్శకుడు – సంజీవ్ రెడ్డి