రియల్ లెజెండ్

Monday,December 26,2016 - 02:30 by Z_CLU

తెలుగు సినీచరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించాడు బాలకృష్ణ. ఇంకా చెప్పాలంటే సౌతిండియాా  సినీచరిత్రలోనే ఇదొక రికార్డు. అవును.. బాలకృష్ణ నటించిన లెజెండ్ మూవీ ఏకంగా వెయ్యి రోజులు ఆడింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని అర్చనా థియేటర్ లో లెజెండ్ మూవీ ఈ రికార్డు రన్ పూర్తిచేసుకుంది. నిజానికి ఇండస్ట్రీలో వెయ్యి రోజులు ఆడిన సినిమాలున్నాయి. కాకపోతే ఈమధ్య కాలంలో ఓ  సినిమా 50రోజులు ఆడడమే గగనం అయిపోయింది. వంద రోజుల ఫంక్షన్లు కనుమరుగైైపోయాాయి. ఇలాాంటి టైమ్ లో లెజెండ్ మూవీ వెయ్యి రోజులు ఆడడం నిజంగా గొప్ప విషయం. ఈరోజు గౌతమీపుత్ర శాతకర్ణి పాటలు తిరుపతిలో గ్రాండ్ గా విడుదలకాబోతున్నాయి. ఈ సందర్భంగా… లెజెండ్ థౌజండ్ డేస్ పోస్టర్ ను విడుదల చేశారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విడుదల వరకు లెజెండ్ మూవీని ఆడించి, ఆ తర్వాత నేరుగా శాతకర్ణి సినిమాను అర్చనా థియేటర్ లో విడుదల చేస్తారు.