మరో ఐటెం సాంగ్ తో రెడీ...

Thursday,October 13,2016 - 09:00 by Z_CLU

‘ఆకలేస్తే అన్నం పెడతా’, ‘కోడి కూర చిల్లు గారే’ ‘నా పేరే కాంచనమాల’… ఈ పాటలు వింటే చిరంజీవి మాస్ మసాలా స్టెప్పులు గుర్తుకు రావడంతో పాటు… దేవిశ్రీప్రసాద్ మేజిక్ కూడా గుర్తొస్తుంది. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఐటెంసాంగ్స్
అన్నీ హిట్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఆ కాంబినేషన్ తెరపైకొచ్చింది. సరికొత్త ఐటెంసాంగ్ షూటింగ్ షురూ అయింది.

  chiranjeevi31443206577

ఖైదీ నంబర్ 150 కోసం దేవిశ్రీ అదిరిపోయే ఐటెంసాంగ్ కంపోజ్ చేశాడు. ఈ సాంగ్ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ పాట కోసం అక్కడ భారీ సెట్ కూడా వేశారు. నిర్మాత రామ్ చరణ్ ఆ సెట్ నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షించాడు. ఈ సెట్ లోనే చిరంజీవి, క్యాథరీన్ కలిసి మాస్ మాస్ గా స్టెప్పులేస్తున్నారు. ఖైదీ నంబర్ 150కు ఈ ఐటెంసాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతోంది. మాస్ కు పెట్టింది పేరైన చిరంజీవి.. ఈ ఐటెంసాంగ్ లో ఎలాంటి స్టెప్పులేశాడోనని ఫ్యాన్స్ ఇప్పట్నుంచే క్యూరియస్ గా ఉన్నారు.