రెడీ టూ స్టార్ట్...

Thursday,February 16,2017 - 02:46 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టేశాడు. సుకుమార్ డైరెక్షన్ లో విల్లేజ్ బాగ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను రెడీ టూ స్టార్ట్ స్టేజ్ తీసుకొచ్చేసిన చెర్రీ ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ మార్చ్ లో స్టార్ట్ చేయాలనీ భావిస్తున్నారు యూనిట్.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ ను పొల్లాచి లో ప్లాన్ చేస్తున్న యూనిట్ రెండో షెడ్యూల్ ను గోదావరి జిల్లాల్లో ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే సినిమాకు సంబంధించి గోదావరి జిల్లాల్లోని కొన్ని లొకేషన్స్ ను పరిశీలించిన సుకుమార్ కథకు సరిపడే లొకేషన్స్ లో ఈ సినిమాను షూట్ చేయబోతున్నాడట. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫాస్ట్ గా ఫాస్ట్ గా జరుపుకుంటున్న ఈ సినిమాలో చెర్రీ సరసన నటించే హీరోయిన్ ను ఫైనల్ చేసే  పనిలో పడ్డారు మేకర్స్…