నాన్నా నేను నా బాయ్ ఫ్రెండ్స్ రిలీజ్ కి రెడీ

Friday,December 02,2016 - 07:30 by Z_CLU

కుమారి 21 F తో కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టిన హెబ్బా పటేల్, ఇప్పుడు  ‘నాన్నా.. నేను.. నా బాయ్ ఫ్రెండ్స్’ తో తన కరియర్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి రెడీ అవుతోంది. తండ్రీ కూతుళ్ళ అనుబందాన్ని కొత్తగా చూపే ఈ చిత్రం డిసెంబర్ 16 న రిలీజ్ అవ్వడానికి అన్ని రూట్స్ క్లియర్ చేసుకుంది.

భాస్కర్ బండి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం లో రావు రమేష్, హెబ్బా పటేల్ కి తండ్రిగా నటిస్తున్నాడు. శేఖర్ చంద్ర ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. నెక్స్ట్ వీక్ ఆడియోని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న సినిమా యూనిట్ ఈ సినిమా సూపర్ హిట్ ఖాయమని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.