Ready Movie - బ్లాక్ బస్టర్ సినిమాకు 13 ఏళ్లు

Saturday,June 19,2021 - 12:54 by Z_CLU

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్ ను మలుపుతిప్పిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రెడీ సినిమా. శ్రీనువైట్ల-రామ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి ఈరోజుకు (జూన్ 19) 13 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా, ఈ సినిమా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ready movie 13 years zeecinemalu 1

రెడీ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్ ను కామెడీగా కూడా చెప్పొచ్చని ప్రూవ్ చేసింది ఈ సినిమా. శ్రీనువైట్ల మార్క్ కామెడీకి ఇది కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.

రామ్-జెనీలియా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు యాడెడ్ అడ్వాంటేజ్ గా మారింది. సినిమాలో కామెడీ ఎంత క్లిక్ అయిందో, సాంగ్స్ కూడా అంతే హిట్. ఈ సినిమాలో 6 పాటలుంటే అన్నీ చార్ట్ బస్టర్సే. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్.

ready movie 13 years zeecinemalu 2

ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటే.. వరుసగా ఏడాదికో లాంగ్వేజ్ చొప్పున కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఇది రీమేక్ అయింది. హిందీ రీమేక్ లో ఏకంగా సల్మాన్ ఖాన్ నటించాడు. రీమేక్ అయిన ప్రతి భాషలో ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

ఇలా రెడీ సినిమా టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు.. ఆ యూనిట్ కు ఓ మెమొరబుల్ హిట్ గా నిలిచింది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics