పదేళ్లు పూర్తిచేసుకున్న సూపర్ హిట్ మూవీ

Tuesday,June 19,2018 - 01:01 by Z_CLU

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది రెడీ సినిమా. శ్రీనువైట్ల-రామ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి ఈరోజుకు పదేళ్లు అవుతోంది. సినిమా పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా, అప్పటి సక్సెస్ ను మరోసారి గుర్తుచేసుకున్నాడు రామ్.

https://twitter.com/ramsayz/status/1008916364692606976

రెడీ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్ ను కామెడీగా కూడా చెప్పొచ్చని ప్రూవ్ చేసింది ఈ సినిమా. శ్రీనువైట్ల మార్క్ కామెడీకి ఇది కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. రామ్-జెనీలియా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు యాడెడ్ అడ్వాంటేజ్ గా మారింది.

సినిమాలో కామెడీ ఎంత క్లిక్ అయిందో, సాంగ్స్ కూడా అంతే హిట్. ఈ సినిమాలో 6 పాటలుంటే అన్నీ చార్ట్ బస్టర్సే. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటే.. వరుసగా ఏడాదికో లాంగ్వేజ్ చొప్పున కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఇది రీమేక్ అయింది. హిందీ రీమేక్ లో ఏకంగా సల్మాన్ ఖాన్ నటించాడు. రీమేక్ అయిన ప్రతి భాషలో ఈ సినిమా సూపర్ హిట్ అయింది.