రెడీ ఫర్ రిలీజ్

Wednesday,February 08,2017 - 12:08 by Z_CLU

సినిమా టౌన్ ఈ వారం కూడా సరికొత్త సినిమాలతో రెడీ అయిపోయింది. ఫిబ్రవరి 9 న రిలీజయ్యే సింగం 3, Jolly LLB 2 తో పాటు 10 న నాగార్జున ఓం నమో వెంకటేశాయ థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి.

సింగం 3 : సౌత్ ఇండియన్ సినిమాలోనే సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీ సింగం. సూర్య హీరోగా తెరకెక్కిన సింగం 3 ఫిబ్రవరి 9 న రిలీజవుతుంది.  హరి డైరెక్షన్ లో తెరకెక్కిన సింగం 3 లో అనుష్క, శృతి హాసన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే క్రియేట్ అయి ఉన్నాయి.

ఓం నమో వెంకటేశాయ : హాతీరాం బాబాగా నాగార్జున నటించిన ‘ఓం నమో వెంకటేశాయ ఫిబ్రవరి 10 న రిలీజ్ అవుతుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, అనుష్క ఓ స్పెషల్ క్యారెక్టర్ లో నటించిన ఈ సినిమా రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కింది. కీరవాణి సంగీతం అందించాడు.

Jolly LLB2: అక్షయ్ కుమార్ హీరోగా నటించిన Jolly LLB కూడా ఫిబ్రవరి 10 నుండి థియేటర్స్ లో స్పేస్ చేసుకోనుంది. హిలేరియస్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సుభాష్ కపూర్ డైరెక్టర్. హుమా ఖురేషి హీరోయిన్ గా నటించింది. Fox Star Studios నిర్మించిన ఈ సినిమాకి చిరాంతన్ భట్ సంగీతం అందించాడు.

హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజవుతున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ మార్క్ తో నిలబడతాయో చూడాలి.