#RC15 - రామ్ చరణ్ సినిమాపై అభిమానుల్లో టెన్షన్

Monday,May 17,2021 - 02:34 by Z_CLU

ఇటివలే భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో రామ్ చరణ్ #RC15 ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి ఈ క్రేజీ కాంబో ఎనౌన్స్ అవ్వగానే అందరు సప్రయిజ్ అయ్యారు. ఎనౌన్స్ అయిన నుండే ఈ సినిమాపై చర్చ మొదలైంది. ఇక దిల్ రాజు నిర్మించనున్న ఈ భారీ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. జూన్ లేదా జులై నుండి షూటింగ్ మొదలు పెడతామని దిల్ రాజు ప్రకటించాడు. అయితే ఇపుడు ఈ క్రేజీ కాంబో సినిమాపై మెగా అభిమానుల్లో సందేహాలు మొదలవుతున్నాయి. సినిమా ఎనౌన్స్ అయిన కొన్ని రోజులకే హిందీలో ‘అపరిచితుడు’ రీమేక్ చేస్తానని ప్రకటించాడు శంకర్. ఇక అందరు శంకర్ ముందుగా ఆ రీమేక్ సినిమానే చేస్తాడని అనుకున్నారు. కానీ అది చరణ్ సినిమా తర్వాతే ఉంటుందని చిన్నగా క్లారిటీ ఇచ్చాడు శంకర్.

కానీ ఇప్పుడు చరణ్ -శంకర్ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అసలు రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఇదేనా ? RRR తర్వాత మెగా పవర్ స్టార్ శంకర్ తోనే చేస్తాడా ? అనే అనుమానాలు మొదలవుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఇటివలే కొన్ని క్రేజీ కాంబో సినిమాలు ఎనౌన్స్ అయి మళ్ళీ ఉన్నపళంగా క్యాన్సిల్ అవుతుండటంతో RC15 సినిమాపై మెగా ఫ్యాన్స్ లో డౌట్ రైజ్ అవుతుంది. ఈ ప్రశ్నలకు బదులు దొరకాలంటే త్వరలోనే చరణ్ నుండి కానీ దిల్ రాజు నుండి కానీ సినిమాపై క్లారిటీ ఇచ్చేలా ఓ అప్డేట్ రావాల్సిందే. అప్పటి వరకు ఈ కాంబో సినిమాపై అభిమానుల్లో సస్పెన్స్ నెలకొంటుంది.

Interesting-gossip-around-on-RamCharan-Shankar-Movie

RamCharan-Shankar-Movie

ఇక ఈ సినిమాలో ఇతర భాషల నుండి స్టార్ హీరోలను తీసుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఆ విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అప్పటి వరకు ఈ సినిమాలో ఇతర హీరోల పేర్లు చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics