ఒక్క సినిమా - 5 టైటిల్స్

Friday,October 26,2018 - 10:02 by Z_CLU

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… ఈ సినిమాకు సంబంధించి ఇంకా టైటిల్ అనౌన్స్ చేయకపోవడంతో రకరకాల టైటిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చరణ్ సినిమాకు చక్కర్లు కొడుతున్న టైటిల్స్ ఏంటి… ఇంతకీ ఈ సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారు… ‘జీ సినిమాలు’ ఎక్స్ క్లూజీవ్ స్టోరీ.


చరణ్ -బోయపాటి సినిమాకు సంబంధించి మొట్టమొదటిసారి ఓ టైటిల్ బయటికొచ్చింది.. గతంలో మెగా స్టార్ చిరు నటించిన ‘స్టేట్ రౌడీ’ అనే టైటిల్ ను చరణ్ సినిమాకు పెట్టబోతున్నట్లు హంగామా నడిచింది.. ఈ టైటిల్ కి మెగా ఫాన్స్ నుండి కూడా ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.


‘స్టేట్ రౌడీ’ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ టైటిల్ కూడా చరణ్ సినిమాకు వినిపించింది. ఈ టైటిల్ బయటిరాగానే బాబాయ్ టైటిల్ తో అబ్బాయి అంటూ ఫాన్స్ హ్యాపీ గా ఫీలయ్యారు.. సినిమాలో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లకు తమ్ముడిగా చరణ్ నటిస్తుండడం, అన్నదమ్ముల చుట్టూ తిరిగే కథ కావడంతో ఈ టైటిల్ ఫిక్స్ అనే టాక్ బయటికొచ్చింది.

ఇక తండ్రి, బాబాయ్ ఇద్దరి టైటిల్స్ కలిపి చరణ్ సినిమాకు ‘రౌడీ తమ్ముడు’ అనే మరో టైటిల్ కూడా బయటకొచ్చింది. అయితే ఇది జస్ట్ ఫ్యాన్స్ క్రియేషన్ మాత్రమే.. మేకర్స్ దృష్టిలో అసలు ఈ టైటిల్ లేదు.

చరణ్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్న ఈ సినిమాకు ‘రూలర్’ టైటిల్ పెట్టబోతున్నారనే టాక్ కూడా అప్పట్లో వినిపించింది. గతంలో బోయపాటి-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన దమ్ము సినిమాలో పాటిది. అయితే ఇది కూడా గాసిప్ గానే మిగిలిపోయింది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న టైటిల్.. ‘వినయ విధేయ రామ’. చరణ్ – బోయపాటి సినిమాకు సంబంధించి తాజా టైటిల్ ఇది. ఇంతకుముందు ‘జయజనకి నాయక’ అనే టైటిల్ పెట్టి హిట్ కొట్టిన బోయపాటి.. చెర్రీ సినిమాకు కూడా ఇలా క్లాసీ టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఆల్ మోస్ట్ ఈ టైటిల్ నే ఫైనల్ చేశారని, దీపావళికి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రావొచ్చని టాక్ నడుస్తోంది.