Ramarao on duty - రవితేజ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

Wednesday,March 23,2022 - 04:28 by Z_CLU

RaviTeja’s Ramarao On Duty Releasing On June 17th

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతోన్న యునీక్ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ` మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. శరత్ మండవ దర్శకుని గా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ LLP, RT టీమ్ వర్క్స్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా మేకర్స్ సినిమా విడుదల తేదీ ని ప్రకటించారు. రామారావు ఆన్ డ్యూటీ జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్ల లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రవితేజ తీక్షణంగా చూస్తోన్న లుక్ ను విడుదల చేశారు. ఇందులో కొన్ని భారీ రవాణా వాహనాలు అడవి గుండా వెళుతుండడాన్ని ఆయన గమనిస్తున్నారు.

ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. రాబోయే రోజుల్లో మరింత హైప్ క్రియేట్ చేసేలా మేకర్స్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తో రాబోతున్నారు. సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ సంగీతంతో పాటు బాణీలు మరింత ఆకట్టుకోనున్నాయి.

యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు, వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీతో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.

raviteja ramarao on duty raviteja ramarao on duty

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics