రవితేజ 'రాజా ది గ్రేట్' టీజర్

Tuesday,August 15,2017 - 09:42 by Z_CLU

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తన అభిమానుల కోసం కొత్త టీజర్ ను విడుదల చేశాడు మాస్ రాజా రవితేజ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న రాజా ది గ్రేట్ టీజర్ ఈరోజు విడుదలైంది. ఈ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపిస్తున్నాడు. టీజర్ లో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. నిమిషం నిడివి కలిగిన ఈ టీజర్ లో అంధుడిగా కనిపించాడు రవితేజ. కాకపోతే కమర్షియల్ హంగులు మాత్రం ఎక్కడా మిస్ కాలేదు. రవితేజ మార్క్ ఎనర్జీ, అనిల్ రావిపూడి స్టయిల్, పంచ్ డైలాగ్ లు అన్నీ ఉన్నాయి ఈ టీజర్ లో.


శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది రాజా ది గ్రేట్ సినిమా. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. సాయి కార్తీక్ సంగీత దర్శకుడు. త్వరలోనే సినిమా షూటింగ్ అప్ డేట్స్ తో పాటు.. విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.