Raviteja's KHILADI Movie - షూటింగ్ అప్ డేట్స్

Monday,December 13,2021 - 03:12 by Z_CLU

Raviteja’s KHILADI Movie Updates

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ వేసిన భారీ సెట్‌లో ఈరోజు నుంచి రవితేజ, మీనాక్షి చౌదరిలపై పాటను చిత్రీకరించనున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను రూపొందిస్తున్నారు. ఇది పూర్తయితే, మరో పాటకు సంబంధించిన షూటింగ్ మాత్రం మిగిలి ఉంటుంది. టాకీ పార్ట్ ఇది వరకే పూర్తి కాగా.. ఈ డిసెంబర్ చివరి కల్లా షూటింగ్ మొత్తం పూర్తిచేస్తారు.

బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ముందుగా ప్రకటించినట్టుగానే ఖిలాడీ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లోకి రానుంది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.