EAGLE పోలాండ్ లో రవితేజ

Monday,October 31,2022 - 01:09 by Z_CLU

మాస్ మహారాజా రవితేజ హీరోగా  కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘ఈగల్’ షూటింగ్ యూరప్ లోని పోలాండ్ లో జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ రవితేజ , కొందరు ఫైటర్స్ పై యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారు యూనిట్. హాలీవుడ్ స్టైల్ ఆఫ్ యాక్షన్ తో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ , కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పోలాండ్ లో నవంబర్ 14వరకు  షెడ్యుల్ జరగనుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో మరో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు.

రవితేజ అప్ కమింగ్ మూవీ ‘ధమాకా’ కి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశాడు. గతంలో  హీరో నిఖిల్ తో కార్తిక్ ‘సూర్య సం ఆఫ్ సూర్య’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ డైరెక్ట్ చేశాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ డైరెక్టర్ గా రెండో సినిమా చేస్తున్నాడు. TG విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈగల్ వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics