ఆ హీరో కథతో రవితేజ

Friday,January 13,2017 - 01:17 by Z_CLU

ప్రెజెంట్ రవితేజ హాలీడే మూడ్ నుంచి బయటికొచ్చి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే తన నెక్స్ట్ సినిమా కోసం ఓ హీరో పక్కన పెట్టిన కథను సెలెక్ట్ చేసుకున్నాడట రవితేజ.

raviteja-anil-ravipudi-zee-cinemalu

ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు. ఎనర్జిటిక్ స్టార్ రామ్. మొన్నటి వరకూ ‘పటాస్’, ‘సుప్రీమ్’ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ బ్లైండ్ క్యారెక్టర్ తో డిఫరెంట్  సినిమా చేయాలనుకున్నాడు రామ్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా తెలిపాడు. అయితే ఈ గ్యాప్ లో ఏం జరిగిందో కానీ… అదే సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా చేయట్లేదని ప్రకటించాడు.  అయితే ప్రెజెంట్ అనిల్  రావిపూడితో రవితేజ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రామ్ కి చెప్పిన కథతోనే మాస్ మహారాజ్ తో  తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడట అనిల్ రావిపూడి. ప్రెజెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.