రవితేజ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్

Wednesday,September 19,2018 - 10:53 by Z_CLU

ఒక సినిమా కంప్లీట్ అయిన వెంటనే గ్యాప్ లేకుండా మరో సినిమా స్టార్ట్ చేయడం రవితేజ స్టయిల్. ఈసారి కూడా మాస్ రాజా అదే చేస్తున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో చేస్తున్న అమర్-అక్బర్-ఆంటోనీ సినిమా షూటింగ్ కొలిక్కిరావడంతో, వీఐ ఆనంద్ డైరక్షన్ లో కొత్త సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు.

రవితేజతో చేయబోతున్న సినిమా అప్ డేట్స్ ను వీఐ ఆనంద్ షేర్ చేశాడు. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని ప్రకటించిన ఆనంద్.. తమన్ సంగీత దర్శకత్వంలో మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ జోరుగా సాగుతుందని తెలిపాడు.

ఈ సినిమాలో రవితేజ, డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్టుకు డిస్కో రాజా అనే టైటిల్ పెట్టారనే ప్రచారం కూడా సాగుతోంది. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తళ్లూరి ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. గతంలో ఈయన రవితేజతో నేలటిక్కెట్టు అనే సినిమా తీశాడు.