మరో సినిమా లాక్ చేసిన మాస్ రాజా

Sunday,April 26,2020 - 12:41 by Z_CLU

 

రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ‘క్రాక్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తయింది. ఇక నెక్స్ట్ రమేష్ వర్మతో ఒక సినిమా చేయబోతున్నాడు. తాజాగా మరో సినిమాను కూడా ఓకే చేశాడు మాస్ రాజా.

అవును… రమేష్ వర్మ సినిమా పూర్తవ్వగానే త్రినాధ్ రావు నక్కినతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ మహారాజ్. ప్రస్తుతం రైటర్ ప్రసన్న కుమార్ ఈ సినిమాకు ఫైనల్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

ఈ కాంబినేషన్ సినిమాను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నారు.