RaviTeja-Nakkina - మరో మాస్ మూవీ

Monday,February 22,2021 - 11:11 by Z_CLU

మాస్‌మ‌హారాజ ర‌వితేజ హీరోగా సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శకుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొంద‌నుంది. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై ప్ర‌ముఖ నిర్మాత‌లు టి జి విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

RaviTeja Trinadha Rao Nakkina Movie Announcement
ర‌వితేజ 68వ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

ఈ సినిమాలో న‌టించే ఇతర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. ఈ సంక్రాంతికి విడుద‌లైన క్రాక్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న ర‌వితేజ త్వ‌ర‌లో ఖిలాడి సినిమాతో మ‌న ముందుకు రానున్నారు. ఖిలాడి మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు.