ఒకేసారి 2 సినిమాలు

Wednesday,August 05,2020 - 01:49 by Z_CLU

మాస్ రాజా మళ్లీ తన ఓల్డ్ ఫార్మాట్ లోకి వచ్చేశాడు. మొన్నటివరకు ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత మరో సినిమా చేసే రవితేజ, ఈసారి మాత్రం ఒకేసారి 2 సినిమాల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేయబోతున్నాడు.

రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు మాస్ రాజా. త్రినాథరావు నక్కిన డైరక్షన్ లో కూడా ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాల్ని ఒకేసారి సెట్స్ పైకి తీసుకురావాలని నిర్ణయించాడు.

ప్రస్తుతం రవితేజ చేతిలో క్రాక్ సినిమా ఉంది. ఈ సినిమా షూటింగ్ కొంచెం పెండింగ్ లో ఉంది. ఇది కంప్లీట్ అయి, కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత 2 కొత్త సినిమాల్ని స్టార్ట్ చేస్తాడు రవితేజ.