NRI గా కనిపించనున్న రవితేజ

Wednesday,January 10,2018 - 06:06 by Z_CLU

ప్రస్తుతం కళ్యాన్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్న రవితేజ, మరో వైపు తన నెక్స్ట్ సినిమాపై కూడా అంతే ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కనున్న  సినిమాతో బిజీ కానున్నాడు మాస్ మహారాజ్. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది.

US బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ NRI గా కనిపించానున్నాడని తెలుస్తుంది. రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు, శ్రీనువైట్ల ఫ్రెష్ కామెడీ తో పాటు హార్ట్ టచింగ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను అతి త్వరలో సెట్స్ పైకి తీసుకు రావాలనే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ తో పాటు తక్కిన టెక్నీషియన్స్ ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.