నా సినిమాలో మహాధన్ లేడు – రవితేజ

Wednesday,May 23,2018 - 02:02 by Z_CLU

శ్రీను వైట్ల మార్క్ కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతుంది రవితేజ అమర్ అక్బర్ ఆంటోని. అయితే ఈ సినిమాలో  రవితేజ కొడుకు మహాధన్ నటిస్తున్నట్టు బిగినింగ్ లో అనౌన్స్ చేసినా, ఇప్పుడు ఈ సినిమాలో మహాధన్ నటించడం లేదని కన్ఫం చేశాడు రవితేజ.

అటు స్టడీస్, ఇటు షూటింగ్ షెడ్యూల్స్ బ్యాలన్స్ అవ్వకపోవడంతో ఈ డెసిషన్ తీసుకున్నట్టు చెప్పాడు రవితేజ. గతంలో రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమాలో రవితేజ చైల్డ్ హుడ్ రోల్ లో కనిపించిన మహాధన్, ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ పర్ఫార్మార్ అనిపించుకున్నాడు.

మహాధన్ సినిమాల్లో నటిస్తానంటే కంపల్సరీ గా ఎంకరేజ్ చేస్తానని చెప్పిన రవితేజ, ప్రస్తుతానికి మాత్రం స్టడీసే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్నాడు. అమర్ అక్బర్ ఆంటోని లో 3 డిఫెరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు రవితేజ. ఈ  సినిమాలో ఇలియానా హీరోయిన్ గా ఫిక్సయింది.