RaviTeja - సీనియర్ హీరో పెర్ఫెక్ట్ ప్లానింగ్

Tuesday,June 29,2021 - 03:36 by Z_CLU

మాస్ మహారాజా రవితేజ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు. అవును లాక్ డౌన్ తన అప్ కమింగ్ సినిమాలకు సంబంధించి మంచి ప్లాన్ రెడీ చేసుకున్నాడు. మరో రెండు రోజుల్లో కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు రవితేజ. శరత్ దర్శకత్వంలో రవితేజ నటించనున్న సినిమా జులై 1 నుండి సెట్స్ పైకి రానుంది. ఓ పది రోజుల పాటు ఈ సినిమా షెడ్యుల్ జరగనుంది.

ఇక జులై ఎండింగ్ లో ‘ఖిలాడి’ షూటింగ్ లో పాల్గొనడానికి దుబాయ్ వెళ్లనున్నాడు రవితేజ. అక్కడ ‘ఖిలాడి’ కి సంబంధించి బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసుకోస్తారు. దాదాపు 25 రోజుల పైనే షూటింగ్ మిగిలి ఉంది. ఆ షెడ్యుల్ ఆగస్ట్ మూడో వారం కల్లా పూర్తి చేసి హైదరాబాద్ వచ్చి సెప్టెంబర్ నుండి త్రినాద్ రావు నక్కిన తో సినిమాను మొదలు పెట్టనున్నాడు రవితేజ. ఆ సినిమా సెప్టెంబర్ మొదటి వారంలో ఓపెనింగ్ జరుపుకొని అదే నెల 13 నుండి షూటింగ్ మొదలు కానుంది.

ఇలా మూడు సినిమాలకు సంబంధించి పర్ఫెక్ట్ షెడ్యుల్స్ రెడీ చేసుకొని ఒకదాని తర్వాత మరొకటి లైన్లో పెట్టి ఫుల్ బిజీ అవ్వనున్నాడు రవితేజ. ‘ఖిలాడి’ ని ఆగస్ట్ వరకు ఫినిష్ చేసి సెప్టెంబర్ నుండి శరత్, త్రినాద్ రావు నక్కిన సినిమాలను బ్యాక్ టు బ్యాక్ షెడ్యుల్స్ తో ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ‘ఖిలాడి’ సినిమాతో ఈ ఏడాదిలోనే థియేటర్స్ లో సందడి చేయనున్నారు. ఫైనల్ షెడ్యుల్ పూర్తయ్యాక కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics