Raviteja - డైరక్టర్ కు బంపరాఫర్

Thursday,January 07,2021 - 05:03 by Z_CLU

తన సినిమా క్రాక్ (KRACK) రిలీజ్ కు ముందే రవితేజ (Raviteja) దర్శకుడికి బంపరాఫర్ ఇచ్చాడు. క్రాక్ హిట్టయితే.. గోపీచంద్ మలినేనితో వెంటనే మరో సినిమా చేస్తానని ప్రకటించాడు మాస్ మహారాజ్.

రవితేజ-గోపీచంద్ మలినేని హ్యాట్రిక్ కాంబినేషన్ గా వస్తోంది క్రాక్ మూవీ. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి డాన్ శీను, బలుపు సినిమాలు చేశారు. ఇప్పుడు హ్యాట్రిక్ కూడా హిట్టయితే.. రవితేజతో మరో సినిమా చేయడానికి మలినేనికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే. తన కెరీర్ లో పూరి జగన్నాధ్ తర్వాత ఎక్కువ సినిమాలు గోపీచంద్ మలినేనితోనే చేశాడు మాస్ రాజా.

మరోవైపు క్రాక్ సినిమా, రవితేజకు ఓ చెక్కుచెదరని రికార్డ్ ను అందించి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా థియేటర్లలో రిలీజ్ అవుతోంది ఈ మూవీ. మాస్ మహారాజ్ కెరీర్ లోనే ఇదొక రికార్డ్.