ఆ డైరెక్టర్ తో రవితేజ మరో సినిమా ?

Monday,June 19,2017 - 03:40 by Z_CLU

అప్పట్లో వరుస సూపర్ హిట్స్ అందుకున్న హిట్ కాంబినేషన్ ప్రస్తుతం మరో సినిమాతో రెడీ అవుతుందనే వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ కాంబినేషన్ మరెవరిదో కాదు మాస్ మహారాజ్ రవితేజ- డైరెక్టర్ శ్రీనువైట్ల… ఈ కాంబినేషన్ లో వచ్చిన ‘వెంకీ’,’దుబాయ్ శీను’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ సాధించడంతో ఇప్పుడు ఈ కాంబోలో సినిమా అనే న్యూస్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది.

లేటెస్ట్ గా వరుణ్ తేజ్ తో ‘మిస్టర్’ సినిమాను తెరకెక్కించిన శ్రీనువైట్ల ప్రస్తుతం మాస్ మహారాజ్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేసి ఇటీవలే రవి తేజకు వినిపించాడని, రవితేజ కి కథ నచ్చడంతో ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాలు పూర్తి అవ్వగానే  మరో సారి శ్రీను వైట్ల తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..