రవితేజ మరోసారి రిపీట్ చేస్తున్నాడు

Friday,June 07,2019 - 10:02 by Z_CLU

రవితేజ కరియర్ లోనే ‘విక్రమార్కుడు’ వెరీ స్పెషల్. ఈ సినిమాలో కరియర్ లోనే ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు రవితేజ. ఈ సినిమా తరవాత మళ్ళీ ‘కిక్ 2’ లో తండ్రిగా.. కొడుకుగా నటించాడు. అయితే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘డిస్కోరాజా’ లో కూడా డ్యూయల్ రోల్ లో మెస్మరైజ్ చేయబోతున్నాడా..?

‘విక్రమార్కుడు’ లో వేరు… అసలు సినిమాలో ఉన్న 2 క్యారెక్టర్స్ కి చూడటానికి ఒకలా ఉంటారనే రీజన్ తప్ప, బిగినింగ్ లో ఈ 2 క్యారెక్టర్స్ కి అసలు సంబంధం ఉండదు. దాంతో సినిమాలో ఈ 2 క్యారెక్టర్స్ కి మధ్య బోలెడంత వేరియేషన్ కుదిరింది. ఆఫీసర్ విక్రమ్ కుమార్ రాథోడ్ ఎంతగా నచ్చేశాడో.. అత్తిలి సత్తి కూడా ఫ్యాన్స్ ని అంతే మెస్మరైజ్ చేశాడు.

విక్రమార్కుడు తరవాత ‘కిక్ 2’ లో ఫాదర్ రోల్ గురించి ముందే తెలుసు కాబట్టి సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోయినా రవితేజ కామెడీ టైమింగ్ లో ఎక్కడా డిజప్పాయింట్ చేయలేదు… చూస్తుంటే ఇప్పుడు కూడా అదే తరహా మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నాడు మాస్ మహారాజ్.

‘డిస్కోరాజా’ సినిమాలో హెవీ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఓల్డ్ మ్యాన్ రోల్ ఒకటి ఉండబోతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఓ సైన్స్ ప్రయోగం వల్ల ఆ ఓల్డ్ మ్యాన్ యంగ్ రవితేజ లా మారతాడు. అయితే ఆ యంగ్ మ్యాన్ రోల్ ని కూడా రవితేజనే ప్లే చేస్తున్నాడని తెలుస్తుంది. అదే గనక జరిగితే ఫ్యాన్స్ కి ఇది డబల్ బొనంజా లాంటిదే.