‘నేల టికెట్’ టీజర్ రివ్యూ

Sunday,April 22,2018 - 09:52 by Z_CLU

కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ‘నేల టికెట్’. మే 24 న రిలీజ్ డేట్ ఫిక్ చేసుకున్న ఈ సినిమా టీజర్ ఈ రోజు రిలీజయింది. రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

“చుట్టూ జనం మధ్యలో మనం… అలా  ఉండాలిరా లైఫంటే..” అంటూ బిగిన్ అయ్యే ఈ టీజర్ ని బట్టి రవితేజ  ఎప్పుడూ జనం కోసం, జనం మధ్య ఉండటానికి ఇష్టపడే కుర్రాడిలా మెస్మరైజ్ చేయనున్నాడని అర్థమవుతుంది.  47 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ లో స్టోరీలైన్ ని పెద్దగా రివీల్ చేయకపోయినా, సినిమా కళ్యాణ్ కృష్ణ మార్క్ కలర్ ఫుల్ ఎంటర్ టైనర్ తెలుస్తుంది.

ఇక టీజర్ మధ్యలో రవితేజ  వైట్ కోర్ట్ వేసుకోవడంతో మాస్ మహారాజ్ ఈ సినిమాలో డాక్టర్ గా కనిపించనున్నాడా, లేకపోతే జస్ట్ హీరోయిన్ ని ఇంప్రెస్ చేయడానికి కాలేజ్ లో జాయిన్ అవుతాడా అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఏది ఏమైనా ‘నేల టికెట్ గాళ్ళతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు…” అనే డైలాగ్ అటు యూత్, ఇటు మాస్ ని విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తుంది.

SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉంది. శక్తికాంత్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.