మాళవిక శర్మ ఇంటర్వ్యూ

Wednesday,May 23,2018 - 04:58 by Z_CLU

ఈ నెల 25 న గ్రాండ్ గా రిలీజవుతుంది రవితేజ ‘నేలటిక్కెట్టు’.  ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాతో ముంబై భామ మాళవిక శర్మ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతుంది. ఫస్ట్ సినిమా తోనే రవితేజ లాంటి బిగ్ స్టార్ సరసన నటించే లక్కీ చాన్స్ కొట్టేసిన మాళవిక, ఈ సినిమా జర్నీని చాలా ఎగ్జైటెడ్ గా షేర్ చేసుకుంది. ఆ విషయాలు మీకోసం…

నేను చూసిన ఫస్ట్ మూవీ

9th క్లాస్ లో ఉన్నప్పుడు నార్నియా చూశాను…

నేను గజదొంగని…

దొంగతనం చేసే అలవాటుంది. రీసెంట్ గా బ్యాంకాక్ కి వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కూడా దొంగతనం చేశాను.

 

అలా జరిగింది…

నీరజ గారు కాల్ చేసి నాకీ సినిమా గురించి చెప్పారు. మొదట్లో నమ్మలేదు. తీరా ముంబై నుండి ఇక్కడికి వచ్చి కలిస్తే కనీసం ఆడిషన్ కూడా చేయలేదు… వెళ్లి పొమ్మన్నారు… అప్పుడు డైరెక్టర్ ని ‘అట్లీస్ట్ ఫోటోషూట్ కూడా చేయలేదు’ అని అడిగితే ‘అవసరం లేదు’ అన్నారు…

నేను ఫిక్సయిపోయా…

కనీసం ఫోటో షూట్ చేయలేదు.. ఆడిషన్ చేయలేదు.. డెఫ్ఫినేట్ గా ఈ సినిమాలో నేను లేనని ఫిక్సయి ముంబై వెళ్ళిపోయా…

షాక్ అయ్యా…

ఆ తరవాత డిసెంబర్ 30 న కాల్ చేసి నెక్స్ట్ మంత్ 5 నుండి షూటింగ్ ఉంటుంది అని చెప్పారు.. షాక్ అయ్యా… నాకు తెలుగు రాదు.. ప్రిపేర్ కూడా అవ్వలేదు…

 

కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు..

ఈ క్యారెక్టర్ కొంచెం టామ్ బాయిష్ గా ఉంటుంది. నువ్వు న్యాచురల్ గా పర్ఫామ్ చెయ్ అంతే అన్నారు…

మైండ్ లో ఒకటే డవ్ట్…

ఫస్ట్ డే షూట్.. నేను పర్ఫామ్ చేయగలనా..? లేకపోతే వీళ్ళు నన్ను వెనక్కి పంపించేస్తారా…? రవితేజ లాంటి స్టార్ రేంజ్ కి నేను పర్ఫామ్ చేయగలనా అనుమానం సినిమాకి ప్యాకప్ చెప్పే వరకు ఉండేది…