సమ్మర్ ఎట్రాక్షన్ గా రానున్న రవితేజ నేలటికెట్టు

Monday,March 26,2018 - 12:32 by Z_CLU

కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రవితేజ సినిమా ‘నేల టిక్కెట్టు’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఇప్పటికే 80 % షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా, మే 24 న  గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది.

 

రీసెంట్ గా ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేసింది. త్వరలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా  తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజని డిఫెరెంట్ యాంగిల్ లో ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.

 

జగపతిబాబు కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకి శక్తికాంత్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు.