రవితేజ ‘నేలటికెట్’ టీజర్ రిలీజ్ కి రెడీ

Friday,April 20,2018 - 07:23 by Z_CLU

కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది రవితేజ నేల టికెట్. అల్ట్రా మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఇంప్రెస్ చేసిన ఫిల్మ్ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని ఈ నెల 22 న మార్నింగ్ 9 కి రిలీజ్ చేయనున్నారు.

మే 24 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుందీ సినిమా. ఇప్పటి వరకు సినిమా స్టోరీ లైన్ కూడా రివీల్ కాకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న సినిమా యూనిట్, 22 న రిలీజవుతున్న ఈ టీజర్ లో ఏయే అంశాలు ఎలివేట్ చేయనున్నారోనన్న క్యూరాసిటీ ఆల్ రెడీ ఫ్యాన్స్ లో బిగిన్ అయిపోయింది.

 

‘నేల టికెట్’ సినిమాలో రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకి శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.