ఉగాదికి రవితేజ ‘నేల టికెట్’ ఫస్ట్ లుక్

Tuesday,March 13,2018 - 04:19 by Z_CLU

ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘నేల టికెట్’ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. కళ్యాణ్ కృష్ణ మార్క్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు, హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఉగాది సందర్భంగా మార్చి 18 న రిలీజ్ కానుంది.

ప్రస్తుతం సినిమాలో హై ఇంపాక్ట్ క్రియేట్ చేసే యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్. దిలీప్ సుబ్బరాయన్ ఈ ఫైట్స్ ని కంపోజ్ చేస్తున్నాడు.

SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమాని సమ్మర్ తరవాత రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. రవితేజ సరసన మాళవిక హీరోయిన్ గా నటిస్తుంది.