రవితేజ మూవీ అప్ డేట్స్

Wednesday,May 03,2017 - 04:40 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని ఖుష్ చేసేసిన రవితేజ, అదే స్పీడ్ లో రెండు సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రాజా ది గ్రేట్ సినిమాతో పాటు, విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో ‘టచ్ చేసి చూడు’ సినిమాలతో సెట్స్ పై ఉన్న మాస్ మహారాజ్ ఏ మాత్రం బ్రేక్ లేకుండా పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ‘రాజా ది గ్రేట్’ సినిమా కోసం రీసెంట్ గా డార్జిలింగ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నాడు. ఇక టచ్ చేసి చూడు సినిమాకోసం రాశిఖన్నా తో జత కట్టనున్న రవితేజ మే సెకండ్ వీక్ నుండి రెగ్యులర్ షూటింగ్ కి అటెండ్ కాబోతున్నాడు. ఈ సినిమాలో సీరత్ కపూర్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.

 

బెంగాల్ టైగర్ తరవాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల ప్లానింగ్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.