Raviteja Varun Tej - చేతులు మారిన సినిమా?

Monday,June 07,2021 - 02:38 by Z_CLU

మాస్ మహారాజ రవితేజ క్రాక్ సక్సెస్ తర్వాత మరింత స్పీడ్ పెంచాడు. ఇప్పటికే రవితేజ చేతిలో ‘ఖిలాడి’ సినిమాతో పాటు శరత్ అనే కొత్త కుర్రడి సినిమా కూడా ఉంది. ఖిలాడి కి సంబంధించి మరో ముప్పై రోజుల షూటింగ్ ఉంది. అది పూర్తవ్వగానే శరత్ తో చేయబోయే థ్రిల్లర్ సినిమాను మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నాడు. ఇక త్రినాద్ రావు డైరెక్షన్ లో రవితేజ చేయాల్సిన సినిమా ఇప్పుడు వరుణ్ తేజ్ కి వెళ్లిందని అంటున్నారు. కారణం ఏమిటో తెలియదు కానీ రవితేజ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్టే అని తెలుస్తుంది.

RaviTeja-Khiladi-May-28-release-zeecinemalu

ఖిలాడీ సినిమాలో రవితేజ

ఇటివలే త్రినాద్ రావు, ప్రసన్న ఇద్దరూ వరుణ్ తేజ్ కి స్క్రిప్ట్ వినిపించారని, వరుణ్ తేజ్ ఈ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినబడుతుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ గని సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత మెగా ప్రిన్స్ కి పెద్ద లైనప్ ఉంది. మరి వాటిని పక్కన పెట్టి ముందుగా త్రినాద్ రావు నక్కిన తో సినిమా చేస్తాడా ? అనేది తెలియాల్సి ఉంది.

ఏదేమైనా ఈ మధ్య ఒక హీరో చేయల్సిన సినిమా మరో హీరోకి చేతికి వెళ్ళడం కామన్ అయిపొయింది. కొన్ని వరుస సినిమాలతో బిజీగా ఉండటం మరో వైపు స్క్రిప్ట్ నచ్చడం కారణాలు అనుకోవచ్చు. మరి త్రినాద్ రావు, రవితేజ సినిమా ఎనౌన్స్ మెంట్ వరకూ వచ్చి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది ? అనేది తెలియాల్సి ఉంది.

varun tej zeecinemalu

వరుణ్ తేజ్

రవితేజ ప్రస్తుతం ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. అలాగే కొత్త కుర్రాళ్ళతో సినిమాలు నిర్మించేందుకు కూడా సిద్ధమవుతున్నాడు. మరి నిర్మాతగా రవితేజ నుండి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో వేచి చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics