కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో రవితేజ సినిమా

Monday,December 04,2017 - 03:02 by Z_CLU

‘రాజా ది గ్రేట్’ సక్సెస్ తరవాత బ్యాక్ టు బ్యాక్ వెంచర్స్ తో బిజీగా ఉన్నాడు రవితేజ. ప్రస్తుతం ‘టచ్ చేసి చూడు’ సినిమా సెట్స్ పై బిజీగా ఉన్న మాస్ మహారాజ్, రీసెంట్ రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిపించుకున్న కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నటించనున్నాడు. ఈ సినిమాను జనవరిలోగా సెట్స్ పైకి తీసుకు వచ్చే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉన్న ఈ మూవీని రామ్ తాళ్ళూరి, వెంకట్ తలారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజని కళ్యాణ్ కృష్ణ స్టైల్ లో డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉన్న ఈ సినిమా యూనిట్ తక్కిన టెక్నీషియన్స్ తో పాటు, ఇతర నటీనటులను ఫిక్స్ చేసుకునే పనిలో ఉంది.